బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ రిపోర్ట్ లతో నారప్ప సినిమా రచ్చ రచ్చ చేసేది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ కూడా అల్టిమేట్ వ్యూవర్ షిప్ రికార్డులను దక్కించుకుంటూ దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి. సినిమా ఫస్ట్ డే నుండే టాలీవుడ్ తరుపున…
అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ ఉండగా ఓవరాల్ గా 32 మిలియన్ వరకు వ్యూస్ ని మొత్తం మీద సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తూ ఉండగా ఇందులో యూనిక్ వ్యూస్ మాత్రం 6.1 మిలియన్ దాకా ఉంటాయి అన్న టాక్ ఉంది. ఇక ఒకవేళ ఇవే సినిమా కి వచ్చిన…
ఫుట్ ఫాల్స్ లా భావిస్తే ఈ ఫుట్ ఫాల్స్ కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఒక నెల రేటు 129 ని టికెట్ రేటు గా అనుకుంటే ఓవరాల్ గా 6.1 మిలియన్ వ్యూస్ ని…
ఆ టికెట్ రేటు తో క్యాలిక్యూలేట్ చేస్తే… ఆల్ మోస్ట్ 78 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చు అనే రఫ్ ఎస్టిమేషన్స్ ని చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కి వచ్చిన రెస్పాన్స్ కి నార్మల్ టైం లో అయ్యి ఉంటే ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ రచ్చ జరిగి ఉండేది కానీ…
పరిస్థితులు ఏమాత్రం కలిసి రాక పోవడం తో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఒక యూనిక్ వ్యూ తో లెక్కేస్తే ఇలాంటి కలెక్షన్స్ ని అందుకుని ఉండేదని అంటున్నారు. మొత్తం మీద ప్రైమ్ వాళ్ళు ఇంకా అఫీషియల్ లెక్కలు రిలీజ్ చేయలేదు కానీ సినిమా వల్ల పెట్టిన అమౌంట్ మొత్తం అయితే రికవరీ అయిందని అంటున్నారు ఇన్ సైడ్ వర్గాల వాళ్ళు.