బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ సొంతం అయ్యింది. అసలే సినిమాకి పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కూడా…
అజిత్ స్టార్ డం తో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ కూడా టాక్ మిక్సుడ్ గా రావడంతో కలెక్షన్స్ పరంగా సినిమా అనుకున్న అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది. మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 65 లక్షల రేంజ్ లో.
గ్రాస్ ని సొంతం చేసుకోగా 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 2.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 1st Day Total WW Collections Approx
👉Tamilnadu – 26.15Cr
👉Telugu States – 0.65Cr
👉Karnataka – 4.35Cr
👉Kerala – 1.35Cr
👉ROI – 0.50Cr
👉Overseas – 15.45Cr***approx
Total WW collection – 48.45Cr(23.80CR~ Share) Approx
ఓవరాల్ గా సినిమా మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 92 కోట్ల దాకా ఉండగా సినిమా ఇంకా 68 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.