Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ పులి మురుగన్ కి 4 ఏళ్ళు…ఆల్ టైం రికార్డ్ కొట్టిన మోహన్ లాల్...

ఇండస్ట్రీ హిట్ పులి మురుగన్ కి 4 ఏళ్ళు…ఆల్ టైం రికార్డ్ కొట్టిన మోహన్ లాల్ ఫ్యాన్స్!!

453
0

మలయాళ మార్కెట్ మిగిలిన ఇండస్ట్రీ లతో పోల్చితే చిన్న మార్కెట్ అంటారు, అలాంటి చోట ముందుగా దృశ్యం సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేశాడు. రొటీన్ కమర్షియల్ మూవీ నే అయినా కానీ మలయాళ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన సినిమా పులి మురుగన్… 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా…

మలయాళం లో అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా మలయాళం తరుపున మొట్ట మొదటి 75 కోట్ల నుండి 140 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా గా చరిత్ర సృష్టించింది, బాహుబలి సినిమా అన్ని చోట్లా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసినా…

కేరళలో…. పులి మురుగన్ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేయలేదు అంటే అక్కడ ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రభంజనం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు… కేరళ లో 83 కోట్లు, తెలుగు లో 9.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 9 కోట్లు ఓవర్సీస్ లో 38 కోట్ల రేంజ్ గ్రాస్ ని టోటల్ గా….

140 కోట్ల రేంజ్ గ్రాస్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేయగా మలయాళం తరుపున బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ కొట్టడమే కాకుండా ఇండియా లో ఆల్ టైం సెకెండ్ బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

ఒకసారి టాప్ ట్రెండ్ రికార్డులను గమనిస్తే…
1)#8YrsOfGabbarSinghHysteria- 13.4Mil~
2)#4YearsOfIHPulimurugan- 13Mil****
3)#17YearsForIHSimhadri: 8.8M+
4)#14YearsForSouthIndiaIHPokiri-8.5M~
5) #1YearForBOMonsterSAAHO – 6.19M+
ఇవీ మొత్తం మీద ఇండియా లో బిగ్గెస్ట్ మూవీ యానివర్సరీ ట్రెండ్ లు… టాలీవుడ్ సినిమాల డామినేషన్ నడుమ సౌత్ లో తమిళ్ సినిమాలు కూడా అందుకోలేని రికార్డ్ ను ఇప్పుడు మళయాళ సినిమా సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here