రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనాకలు తెప్పించే న్యూస్!

0
1031

     ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉన్నా…. ఒకవేళ నిజం అయితే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి, కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నాయక్ లో డ్యూయల్ రోల్ తో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి ఏకంగా మూడు పాత్రలు చేస్తూ సంచలనం సృష్టించ బోతున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా పై రోజు కో రూమర్ బయట పడుతూ సినిమా పై మరింత ఆసక్తి ని పెంచేస్తున్నాయి అని చెప్పాలి.

ఇప్పటికే కథ పాయింట్ ప్రకారం ఇద్దరు హీరోలు పునర్జన్మలు ఎత్తుతారు అన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుండగా ఇప్పుడు రామ్ చరణ్ క్యారక్టర్ ప్రకారం ఏకంగా మూడు డిఫెరెంట్ రోల్స్ ని ఈ సినిమా లో పోషిస్తున్నాడని వార్తలు చాలా గట్టిగానే ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ వార్తల ప్రకారం సినిమా లో రామ్ చరణ్ పాత్రలు ఇలా ఉండబోతున్నాయని అంటున్నారు, అందులో ఒకటి బ్రిటిష్ ఆఫీసర్ గా.. రెండు ఫ్రీడమ్ ఫైటర్ గా… మూడు మాస్ నాయకుడుగా ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడని వార్తలు శిఖారు చేస్తున్నాయి.

ఎన్టీఆర్ పాత్ర గురించిన వివరాలు బయటికి రావడం లేదు కానీ రామ్ చరణ్ కి సంభందించి ఈ న్యూస్ నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి వార్తే అని చెప్పాలి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అన్నది ఒక్క జక్కన్న కి తప్ప ఎవరికీ తెలియదు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!