Home న్యూస్ అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ..దెబ్బపడింది

అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ..దెబ్బపడింది

0

           మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్ల ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని… వరుస పరాజయాలతో ఉన్న ఈ ఇద్దరి కలయికలో ఇది వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకోవడం తో ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఓవర్సీస్ లో భారీ ఎత్తునే రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ నుండి ఓవరాల్ గా యావరేజ్ టాక్ మాత్రమే లభించింది. ఇక రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పండండి.

స్టోరీ లైన్: చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన రవితేజ ఇలియానాల ఫ్యామిలీస్ ని విలన్స్ చంపేస్తారు.. అప్పటి నుండి వీరిద్దరు విలన్స్ పై పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తారు.. మరి పగ తీర్చుకున్నారా లేదా అసలు పాయింట్, అలాగే రవితేజ ఒక్కరా లేక ముగ్గురా అన్నది థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్: రవితేజ ఎప్పటి లానే ఫుల్ ఎనర్జీ తో నటించి మెప్పించాడు. మూడు పాత్రల్లో తన సత్తా చూపాడు. ఇలియానా లుక్స్ పరంగా నటన పరంగా జస్ట్ ఒకే అనిపించుకుంది. మిగిలిన నటీనతుల్లో వెన్నెల కిషోర్, సత్యా, మరియు సునీల్ కామెడీ….

అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిది మెరలో నటించారు. ఉన్నంతలో రవితేజ వన్ మ్యాన్ ఆర్మీ గా సినిమా ని తన భుజాన మోశాడు అని చెప్పొచ్చు. కానీ కథ అంత గట్టిగా లేకపోవడంతో మోసిన ఫలితం దక్కలేదు.

సంగీతం: తమన్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్, హీరో ఎలివేషన్ సీన్స్ కి మాత్రం చాలా బాగా ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ కి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు రవితేజ ఎనర్జీ బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పాలి.

సాంకేతిక వర్గం: ఎడిటింగ్ ఏమాత్రం బాలేదు, స్క్రీన్ ప్లే చూస్తే తర్వాత సీన్ ని ఇట్టే గుర్తు పట్టేలా ఉంది. ఇలా మిగిలిన సాంకేతిక వర్గం పనితీరు ఆకట్టుకోలేదు కానీ కేమరామెన్ పనితనం బాగుంది, లొకేషన్స్ అద్బుతంగా ఉన్నాయని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్బ్.

విశ్లేషణ: నేను మారిపోయాను అంటూ వచ్చిన శ్రీను వైట్ల మాటల వరకే మారిపోయాడు సినిమా పరంగా రొటీన్ రివెంజ్ డ్రామా కి కామెడీ ని యాడ్ చేసి తన రొటీన్ ఫార్మాట్ నే నమ్ముకున్నాడు. అది మరోసారి బెడిది కొట్టింది. కామెడీ కొన్ని సీన్స్ కె నవ్వించింది.

యాక్షన్ సీన్స్ కొన్ని ఆకట్టుకున్నాయి, రవితేజ ఎనర్జీ ఆకట్టుకుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ వీటిలో దేని లో కూడా శ్రీను వైట్ల మార్క్ కనిపించలేదు. తనింకా దూకుడు, బాద్ షా కాలంలోనే ఉన్నాడేమో అనిపిస్తుంది చాలా సార్లు.

హైలెట్స్: రవితేజ పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్: వీక్ డైరెక్షన్, వీక్ స్టోరీ, బోరింగ్ సీన్స్, సాంగ్స్

ఓవరాల్ గా సినిమా శ్రీనువైట్ల రవితేజ లకి నికార్సాయిన కంబ్యాక్ అయితే కాదనే చెప్పాలి. కొత్తదనం కోరుకునే వారికి సినిమా బోర్ కొడుతుంది. రొటీన్ మూవీస్ ఇష్టపడే వారికి కొన్ని సీన్స్ నచ్చుతాయి తప్పితే పూర్తిగా సంతృప్తినిచ్చే సినిమా కాదు.

టోటల్ గా సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…రవితేజ లాంటి హీరో నుండి మళ్ళీ వెంకీ, దుబాయ్ శీను, కిక్, లాంటి సినిమాలు, శ్రీను వైట్ల నుండి ఢీ, వెంకీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు లాంటి అల్టిమేట్ ఎంటర్ టైనర్స్ కోసం ఎదురు చూడక తప్పెలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here