Home న్యూస్ రొమాంటిక్ మూవీ రివ్యూ…సినిమా హిట్టా-ఫట్టా!!

రొమాంటిక్ మూవీ రివ్యూ…సినిమా హిట్టా-ఫట్టా!!

0

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు వచ్చేసింది, సినిమా టీసర్ ట్రైలర్ లు అలాగే సాంగ్స్ సినిమా యూత్ ని టార్గెట్ చేసి తెరకక్కించిన సినిమా అని క్లియర్ చేయగా సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు 630 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకోగలిగిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే….

సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ కొడుకు అయిన హీరో తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అనాధ అవుతాడు… బ్రకడం కోసం తప్పుడు మార్గాలను ఎంచుకునే హీరో అనాధ పిల్లల కోసం ఓ ఇల్లు కట్టించాలని చూస్తూ ఉంటాడు. గోవా లో రెండు గ్యాంగుల మధ్య పోరు ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది…

హీరో ఒక గ్యాంగ్ లో చేరగా అనుకోకుండా ఆ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు… తర్వాత అనుకోకుండా హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. హీరోయిన్ కూడా మొదట్లో నో చెప్పినా తర్వాత ఇష్టపడుతుంది. వీళ్ళ మధ్య ఉన్నది ప్రేమా మొహమా అని వీళ్ళు ఎలా తెలుసుకున్నారు, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ…

ఈ కథ మొత్తం గోవా లో గ్యాంగ్స్ ని అంతమొందించాలని వచ్చిన ఏసీపీ రమ్య‌ గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌) వాయిస్ ఓవర్ తో మొదలు అవుతుంది… పూరీ జగన్నాథ్ సినిమాల్లో కథ బలంగా ఎప్పుడూ ఉండదు, కథనం మాత్రం రేసీ స్క్రీన్ ప్లే తో దూసుకు పోతూ ఉంటుంది, ఇక్కడ కూడా ఇదే జరిగింది, సినిమాలో కథ ఏమి లేదు కానీ క్యారక్టర్స్ ఆకట్టుకునేలా ఉండటం…..

సీన్ బై సీన్ మెప్పించేలా చాలా వరకు రాసుకున్న పూరీ కొన్ని సీన్స్ లో బాగానే ఇంప్రెస్ చేశాడు… కానీ కథ అంత బలంగా లేక పోవడంతో ఒక స్టేజ్ లో సినిమా గాడితప్పి పోతుంది, తర్వాత కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసి క్లైమాక్స్ గ్యాంగ్ స్టర్స్ జీవితాలు ఇలానే ఎండ్ అవుతాయి అంటూ ముగించిన తీరు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

మొత్తం మీద పెర్ఫార్మెన్స్ పరంగా ఆకాష్ పూరీ ఇది వరకు సినిమాల కన్నా చాలా బెటర్ గా పెర్ఫార్ చేశాడు, ఈ స్టొరీ ఇప్పుడు కాకుండా ఓ రెండు మూడేళ్ళ తర్వాత తనకి పడి ఉండే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. మాస్ సీన్స్ లో బాగా చేశాడు, డైలాగ్ డిలివరీ ఆకట్టుకుంది, హీరోయిన్ యూత్ ని మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి.

రమ్యకృష్ణ రోల్ ఆకట్టుకోగా సంగీతం బాగుంది బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్ గా ఉంది, యాక్షన్ సీన్స్ పర్వాలేదు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తర్వాత సీన్ యిట్టె చెప్పే విధంగా ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ ఫాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే.. చాలా సింపుల్ స్టొరీ ని జస్ట్ పూరీ మార్క్ హీరోయిజం అండ్ డైలాగ్స్ తో….

మెప్పించే ప్రయత్నం చేసినా ఇలాంటి కథలు పూరీ ఇప్పటికే అనేకం చేసి చేసి ఉండటం మనం చూసి చూసి ఉండటంతో ఏమాత్రం కొత్తదనం అనిపించదు. ఈ కథ కూడా యూత్ నే టార్గెట్ చేసి తెరకెక్కించారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలో కావల్సిన సరుకు అయితే ఉంది… కానీ రెగ్యులర్ మూవీ గోర్స్ కి సినిమా రొటీన్ మూవీ అని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here