RRR –వేట మళ్ళీ మొదలైంది!

0
227

     ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా లో టాలీవుడ్ హేమాహేమీలే కాక ఇతర ఇండస్ట్రీ ల నుండి కూడా హేమాహేమీలు నటుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ప్రజంట్ టాప్ హిరోయిన్ అయిన ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ హీరోయిన్ డేసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంచుకోగా కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

దాంతో అప్పటి నుండి హీరోయిన్ వేట మళ్ళీ మొదటికి వచ్చింది, ఎన్టీఆర్ సరసన నటించడానికి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ని అలాగే హాలీవుడ్ నుండి కూడా కొంతమందిని ఈ లిస్టులో చేర్చినట్లు తెలుస్తుంది, ఒక్కొక్కరిని పరిశీలించి త్వరలోనే ఎవరో ఒకరిని ఫైనల్ చేసి షూటింగ్ స్పీడప్ చేయాలనీ యూనిట్ భావిస్తుందట.

ఇక రీసెంట్ గా షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్ కోలుకోవడానికి రెండు మూడు వారాలు పడుతుంది అనడంతో అప్పటి వరకు షూటింగ్ ని ఆపిన టీం, ఈ గ్యాప్ లో హీరోయిన్ వేట ని కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారు. ఇక సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే…

ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందులో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు, సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకునే రాజమౌళి ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల హెల్ప్ తో మరెన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేస్తాడో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!