కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో దుమ్ము లేపినా తర్వాత ఒకటికి మించిన ఫ్లాఫ్ ఒకటి వరుసగా 6 పరాజయాలను ఎదురుకున్న హీరో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, సుప్రీమ్ తో అతి తక్కువ సమయం లో స్టార్ హీరోల రేంజ్ కి ఎదుగుతున్నాడు అనుకుంటున్న సమయం లో వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ మరియు తేజ్ ఐ లవ్ యు అంటూ 6 అట్టర్ ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్న…
సాయి ధరం తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ పై బజ్ ఏమాత్రం ఉండకూడదు, కానీ కాంబినేషన్ మహిమ వల్ల అనుకోవచ్చు ఇతర కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు కానీ కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పుతిరాజ్ ల కలయకలో… నేను శైలజా మరియు ఉన్నది ఒకటే జిందగీ ల దర్శకుడు…
కిషోర్ తిరుమల దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణం లో వస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రలహరి పై బజ్ బాగా ఏర్పడగా టీసర్ నుండి ట్రైలర్ వరకు అన్నీ ఆకట్టుకోవడం సినిమాపై ఆసక్తి అంచనాలు పెరిగిపోయాయి. ఆ ఎఫెక్ట్ బిజినెస్ పై కూడా గట్టిగానే పడింది అని చెప్పాలి.
సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే…
Nizam – 5cr
Andhra – 6Cr
Ceeded – 3.6cr
Total AP TG – 14.6 Cr
Karnataka & ROI – 1.6cr
Total Overseas – 2.8cr
Total Business – 18cr ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్.
ఇక ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే అక్షరాల 19 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం సినిమా పై ఉన్న బజ్ దృశ్యా హిట్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి. 6 ఫ్లాఫ్స్ పడ్డా బిజినెస్ పరంగా దుమ్ము లేపిన సాయి ధరం తేజ్ ఈ సినిమా తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం…