వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేసే బాలీవుడ్ సూపర్ స్టార్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సేల్ఫీ రిలీజ్ అయింది, ఇమ్రాన్ హష్మీ ఇందులో మరో రోల్ లో నటించగా టీం సినిమాను భారీగా ప్రమోట్ చేశారు, మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ మొత్తం ఒక హీరో అలాగే తన ఫ్యాన్ కి మధ్యలో జరుగుతుంది…
హీరోని అభిమానించే ఓ పోలిస్ అయిన ఇమ్రాన్ హాష్మి అనుకోకుండా తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన హీరో అవమానిస్తాడు, అప్పటిదాకా అభిమానించే ఆ ఫ్యాన్స్ హీరోకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి ఎన్ని పరీక్షలు పెట్టాడు, హీరో ఏం చేశాడు అన్నది సినిమా స్టొరీ పాయింట్… చాలా సింపుల్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా…
మొదటి సీన్ నుండి రిచ్ గా ఉన్నా కానీ, సీన్ బై సీన్ వస్తూ వెళుతున్నా కానీ ఎక్కడా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు, ఇటు అక్షయ్ కుమార్ అటు ఇమ్రాన్ హాష్మిలు బాగా నటించినా కథ మొత్తం ఒరిజినల్ తో పోల్చితే చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించడం బిగ్ మైనస్ పాయింట్…. దాంతో లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం… ఓ చిన్న పాయింట్ ని…
చాలా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది, పాటలు పర్వాలేదు అనిపించినా కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, మొత్తం మీద అక్షయ్ కుమార్ ఖాతాలో మరో నిరాశ కలిగించే సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్న ఈ సినిమా ఒరిజినల్ చూడని వాళ్ళకి యావరేజ్ లెవల్ లో అనిపించే అవకాశం ఉందని చెప్పాలి… ఇక ఈ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.