నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీస్ రెండూ కూడా అనుకోని పరిస్థితుల నడుమ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోలేక పోయాయి. దాంతో సినిమాలు రెండూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వలేక డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. రెండింటికీ కూడా మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కానీ వ్యూవర్ షిప్ విషయం లో మాత్రం సాలిడ్ గానే సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి.
ఇక నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. సినిమా టీసర్ కి గాని…
ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కి కానీ మంచి రెస్పాన్స్ లభించింది. సౌత్ భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ కానున్న ఈ సినిమా కి ట్రేడ్ లో మంచి బజ్ ఉందని ఇప్పుడు సినిమా సాధిస్తున్న బిజినెస్ చూస్తె అర్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో పోటి లో రిలీజ్ అవుతున్నా మంచి బిజినెస్ ఆఫర్స్ ను….
సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ లో హిందీ డబ్బింగ్ అలాగే ఇప్పుడు తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్ముడు పోయి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. హిందీ డబ్బింగ్ రేటు 10 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా ఇప్పుడు తెలుగు శాటిలైట్ రైట్స్ రేటు…
కూడా 10 కోట్ల రేటుని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ సొంతం చేసుకోగా రెండు చోట్ల రైట్స్ కలిపి 20 కోట్లు రాబట్టిన ఈ సినిమా బడ్జెట్ లో సగం ఇక్కడే రికవరీ చేసింది అంటున్నారు. ఇక ఇతర భాషల బిజినెస్, డిజిటల్ రైట్స్ అండ్ ఫైనల్ గా థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాతకి ఫుల్ ప్రాఫిట్స్ రావడం ఖాయమని చెబుతున్నారు ఇప్పుడు.