జబర్దస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అడపా దడపా సినిమాల్లో హీరోగా ట్రై చేసిన విషయం తెలిసిందే, కానీ ఆ సినిమాలు ఏవి కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ రీసెంట్ టైం లో హీరో గా చేసిన సినిమాల్లో పర్వాలేదు అనిపించేలా గుర్తింపు తెచ్చు కున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందు కు రాగా పర్వాలేదు అని పించుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ గా 1.8 కోట్ల బిజినెస్ అందుకోగా 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 10 రోజుల్లో 1.3 కోట్ల షేర్ ని అందుకోగా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి సినిమా టోటల్ గా 1.46 కోట్ల షేర్ ని అందుకుని…
యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది, పెద్దగా పబ్లిసిటీ లేకుండానే సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇక రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి అక్కడ కూడా మంచి TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి.
ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి టెలివిజన్ లో 6.09 TRP రేటింగ్ దక్కింది. ఇది మరీ అద్బుతం కాదు కానీ ఇదే టైం ఎన్నో రెట్ల బడ్జెట్ అండ్ పబ్లిసిటీ తో వచ్చిన రజినీకాంత్ దర్బార్ మూవీ 6.89 TRP రేటింగ్ నే సాధించిన నేపధ్యం లో చాలా లో బడ్జెట్ లో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్ కి…
ఆల్ మోస్ట్ అదే రేంజ్ లో TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి. హీరోగా చేసిన సినిమాల్లో ఈ సినిమాతో బెస్ట్ రిజల్ట్ ని అందుకున్న సుధీర్ కెరీర్ ని సజావుగా ప్లాన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ మరింతగా వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. జబర్దస్త్ పాపులారిటీ కూడా ఇలా పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ రావడానికి కారణం అని కూడా చెప్పొచ్చు.