బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత టాలీవుడ్ తరుపున రిలీజ్ అయిన మొట్ట మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటర్… బాక్ టు బాక్ 2 హిట్స్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన ఈ సినిమా సమ్మర్ రేసు నుండి కరోనా వలన డిజిటల్ రిలీజ్ అవుతుంది అనుకున్నా చివరి నిమిషంలో ఆపేసి థియేటర్స్ లో కరోనా తర్వాత రిలీజ్ అయిన మొట్ట మొదటి నోటబుల్ మూవీ గా నిలిచింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని 50% ఆక్యుపెన్సీ తోనే సొంతం చేసుకున్న ఈ సినిమా పాండమిక్ తర్వాత ఇండియా లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన మొదటి సినిమాగా నిలిచింది, అలాంటి సినిమా టోటల్ రన్ లో…
12.61 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలవగా సినిమా కంప్లీట్ రైట్స్ ను ముందే ఏకంగా 38 కోట్లకు కొన్న జీ తెలుగు వాళ్ళు తర్వాత సినిమాను తామే థియేట్రికల్ రిలీజ్ చేయగా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు.
ఆల్ రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి తర్వాత మళ్ళీ పే పెర్ వ్యూ పద్దతిలో జీ 5 ప్లెక్స్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన మొదటి సారి మంచి రేటింగ్ నే సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, సినిమా కి మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.72 TRP రేటింగ్ సొంతం అవ్వగా ఓవరాల్ గా కుమ్మేసింది అనే చెప్పాలి.
సినిమా పెర్ఫెక్ట్ శాటిలైట్ రైట్స్ రేటు ఎంత అనేది క్లియర్ గా తెలియరాలేదు కానీ మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో ఉంటుంది అన్న టాక్ ఉంది, ఆ టాక్ ప్రకారం చూసుకున్నా సినిమా కి సాలిడ్ TRP రేటింగ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక రిపీట్ టెలికాస్ట్ తో సినిమాకి మంచి ప్రాఫిట్స్ దక్కడం ఖాయమని చెప్పొచ్చు.