Home న్యూస్ అల వైకుంఠ పురంలో టీసర్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

అల వైకుంఠ పురంలో టీసర్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత తెరకెక్కుతున్న మూడో సినిమా అల వైకుంఠ పురంలో… ఏడాదిన్నరకి పైగా అల్లు అర్జున్ ఎలాంటి మూవీ చేయకుండా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు ఇప్పుడు అల వైకుంఠ పురంలో టీసర్ తో అభిమానులను పలకరించాడు. అల వైకుంఠ పురంలో అఫీషియల్ టీసర్ ఎట్టకేలకు వచ్చేయగా దుమ్ము దులిపేసింది అని చెప్పొచ్చు.

త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలింగ్, యాటిట్యూడ్, భారీ స్టార్ కాస్ట్ ఇలా టీసర్ లో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూపెట్టిన టీసర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ ఓ రేంజ్ లో కుమ్మేశాడు అని చెప్పాలి.

ఓవరాల్ గా టీసర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ టేకింగ్ దుమ్ము లేపగా అల్లు అర్జున్ గెటప్ అండ్ స్టైలింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఓవరాల్ గా అల వైకుంఠ పురంలో అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎలా ఉండబోతుందో టీసర్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా చూపెట్టింది.

ఇక మైనస్ లు ఏమి లేవని చెప్పొచ్చు, ఒకవేళ ఏరి కోరి చెప్పాలి అంటే త్రివిక్రమ్ అరవింద సమేత తో డిఫెరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు అనుకుంటే తిరిగి మళ్ళీ అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి కాన్సెప్ట్ ని తిప్పి చెబుతున్నాడు అని చెప్పొచ్చు.

కానీ వేటికవే ఆకట్టుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఈ సారి సంక్రాంతి కి వస్తున్న అల వైకుంఠ పురంలో కూడా సాలిడ్ ఇంపాక్ట్ ని ఫ్యామిలీ ఆడియన్స్ లో అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ ఫాలోయింగ్ ఏంటో మరో సారి చూపెట్టే అవకాశం పుష్కలంగా ఉంది, సంక్రాంతి పోటి ఓ రేంజ్ లో ఉండేలా కనిపిస్తుంది. ఇక టీసర్ మీరు చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here