కొన్ని కొన్ని సార్లు కొన్ని సినిమాలు ఎక్కువగా ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో ఇలాంటి ట్రోల్స్ ని విపరీతంగా ఫేస్ చేసిన సినిమా ది లెజెండ్…. శరవణ స్టోర్స్ ఓనర్ అయిన శరవణన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా భారీ ఎత్తున సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకుని వచ్చారు మేకర్స్…
కానీ సినిమా టాక్ నిరాశ కలిగించే విధంగా ఉండగా సినిమాలో హీరో యాక్టింగ్ చూసి థియేటర్స్ లోనే పొట్ట చెక్క లయ్యేలా నవ్వారు జనాలు, సీరియస్ సీన్స్ కూడా కామెడీ అవ్వడంతో ఈ సినిమా రీసెంట్ టైంలో ఎక్కువ ట్రోల్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా…
థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అనుకుంటే….హీరో కం నిర్మాత అయిన శరవణన్ ఈ సినిమా పై వచ్చిన ట్రోల్స్ ని చూసి సినిమా డిజిటల్ రిలీజ్ ను ఆలస్యం చేశాడు. ఎట్టకేలకు ఈ సినిమాను ఇప్పుడు మార్చ్ 3న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో…
డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు… 45 కోట్లతో సినిమా తీస్తే 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద 15 కోట్ల దాకా రికవరీ చేసినా కానీ పెట్టిన బడ్జెట్ దృశ్యా ఇప్పటికీ నష్టాలను భారీగానే సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ లో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.