Home గాసిప్స్ అప్పుడేమో 18 కోట్లు…ఇప్పుడు రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అప్పుడేమో 18 కోట్లు…ఇప్పుడు రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0

ఆఫర్లు వచ్చినప్పుడే అవి బెటర్ గా ఉంటె ఒప్పు కోవాల్సింది కానీ చాలా సినిమాలు సరైన టైం కి రెస్పాండ్ అవ్వక ముందు మంచి ఆఫర్స్ వచ్చినా వాటికి నో చెప్పి ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ నుండి లాంచ్ అవుతున్న డెబ్యూ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కి నిర్మాతలు ఆఫర్ల కోసం ఎదురు చూడటం లేదు కానీ..

ఆఫర్లు సడెన్ గా తగ్గిపోయాయి అని ట్రేడ్ టాక్.. సినిమా ను సుమారు 16 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారు అని ట్రేడ్ లో టాక్ ఉండగా సినిమా కు ముందుగా డిజిటల్ రిలీజ్ కి గాను 14 కోట్ల రేంజ్ రేంజ్ ఆఫర్లు దక్కగా…

ఆ టైం లో బడ్జెట్ ఎక్కువ కాబట్టి ఈ ఆఫర్లకు ఒప్పుకోవడం లేదు అన్న వార్తలు వచ్చాయి. కానీ తర్వాత పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి ఈ సినిమాకి, అందులో 16 కోట్లు, 18 కోట్ల రేంజ్ ఆఫర్లు కూడా వచ్చినప్పటికీ నిర్మాతల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా పోవడం తో ఇక సినిమాను పట్టించుకోలేదట ఎవ్వరూ.

నిర్మాతలు కూడా పరిస్థితులు సద్దుకున్నాక థియేటర్స్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలి అని ఈ ఆఫర్స్ ని పట్టించుకోలేదు. కాగా ఇప్పుడు ఆల్ రెడీ ఒక బిగ్ మూవీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవ్వగా మిగిలిన సినిమాలకు ఇప్పుడు OTT యాప్స్ చెప్పిందే రేటు గా మారగా… ముందు ఉప్పెన టీం ని అప్రోచ్ అవ్వని కొత్త OTT యాప్ వాళ్ళు….

రీసెంట్ గా సినిమా కి కేవలం 13.5 కోట్ల రేంజ్ ఆఫర్ ని ఇచ్చారట. ముందు 18 కోట్ల రేంజ్ ఆఫర్ వచ్చింది అంటే ఇప్పుడు ఇదే రేటు అని అన్నారట. దానికి నిర్మాతలు సినిమాను మేం అమ్మమని, థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పి పంపించారట. హీరో డెబ్యూ మూవీ కాబట్టి లాభమో నష్టమో తామే భరించాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు… కానీ రేట్లు మాత్రం ఇప్పుడు అన్ని సినిమాలకు తగ్గుతున్నట్లు ఈ సినిమాకి కూడా తగ్గడం కొంత షాకింగ్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here