మన దగ్గర స్టార్ హీరోలు ఎక్కువ మంది కాబట్టి ఒకరి సినిమా వచ్చినప్పుడు రికార్డులను మరో స్టార్ హీరో సినిమా టైం లో బ్రేక్ అవ్వడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, సోషల్ మీడియా రికార్డుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కానీ మనతో పోల్చితే కోలివుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ సోషల్ మీడియాలో కానీ రీసెంట్ టైం లో పోటి అంటే మాత్రం కేవలం ఇద్దరి మధ్యనే ఉంటుంది…
వాళ్ళే విజయ్ మరియు అజిత్ కుమార్ లు, ఈ ఇద్దరిలో కూడా ప్రస్తుతం విజయ్ మరింత భారీ లీడ్ తో దూసుకు పోతున్నాడు. విజయ్ నటించిన సినిమాల కలెక్షన్స్ కానీ సోషల్ మీడియా రికార్డులు కానీ ఓ రేంజ్ లో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి.
విజయ్ కి పోటి ఇవ్వడానికి అజిత్ ట్రై చేస్తున్నా సినిమాల రిలీజ్ లు ఆలస్యం అవుతూ ఉండటం వలన కొంచం వెనకబడ్డాడు అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అజిత్ నటించిన వలిమై సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ సాలిడ్ గానే సొంతం చేసుకోగా…
మొదటి 32 నిమిషాలకే 500K లైక్స్ ని 3 గంటల 26 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ ని అందుకోవడంతో 24 గంటల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయి అని అందరూ అనుకున్నారు. వ్యూస్ పరంగా కూడా స్టార్టింగ్ లో యమ జోరుగా దూసుకు పోయిన ఈ ట్రైలర్ తర్వాత కంప్లీట్ గా స్లో అయిపోయి మొత్తం మీద 24 గంటలు అయ్యే టైం కి 11.16 మిలియన్ వ్యూస్ ని 1.32 మిలియన్ లైక్స్ తో..
సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో వ్యూస్ పరంగా రాధే శ్యామ్ 23.2 మిలియన్ తో ఉండగా కోలివుడ్ పరంగా బిగిల్ 18.6 మిలియన్స్ తో లైక్స్ పరంగా 1.66 మిలియన్ తో టాప్ లో ఉంది. వలిమై ట్రైలర్ స్టార్టింగ్ ఊపు చూసి కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నా మొత్తం మీద 24 గంటల రిపోర్ట్స్ చూసిన తర్వాత కొంచం నిరాశతోనే ముగిసింది అనే చెప్పాలి.