కొన్ని కొన్ని కాంబినేషన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ క్రేజ్ ని రీ క్రియేట్ చేస్తాయి. ఆ కాంబినేషన్ లో మూవీ అంటే ఆడియన్స్ లో క్రేజ్ పీక్స్ లో ఉంటుంది, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ కోలివుడ్ లో ఇలయ దళపతి విజయ్ మరియు అట్లీ లది అని చెప్పొచ్చు. విజయ్ సరైన హిట్స్ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఒక్కో సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర…
విజయ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉన్న సినిమా లు క్రమం తప్పకుండా ఇచ్చాడు డైరెక్టర్ అట్లీ… రాజా రాణీ సినిమా తో డైరెక్టర్ గా ఎంటర్ అవ్వగా తర్వాత సినిమాలు అన్నీ విజయ్ తోనే చేశాడు అట్లీ.. తెరీ సూపర్ హిట్ తర్వాత మెర్సల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా…
తర్వాత చేసిన బిగిల్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది, దాంతో వీరి కాంబినేషన్ పై అంచనాలు విజయ్ మురగదాస్ ల క్రేజ్ ని కూడా మించిపోయింది. దాంతో ఇప్పుడు త్వరలో అట్లీ ఓ భారీ ప్రయోగాన్ని విజయ్ తో చేయబోతున్నాడు అన్నది కోలివుడ్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న వార్తా.
విజయ్ తో ఏకంగా 300 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఓ సోషియో ఫాంటసీ మూవీ ని ప్లాన్ చేయాలని చూస్తున్నాడట అట్లీ. ప్రస్తుతం కథ ని ప్రిపేట్ చేసే పనిలో ఉండగా 2021 సెకెండ్ ఆఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని కోలివుడ్ లో టాక్ వినిపిస్తుంది, విజయ్ ఇది వరకు సోషియో ఫాంటసీ జానర్ లో…
పులి సినిమా చేశాడు, కానీ ఆ సినిమా అందరినీ నిరాశపరిచింది, కానీ ఈ సారి మాత్రం భారీ క్రేజ్ నడుమ అల్టిమేట్ కాంబినేషన్ లో రూపొందుతుంది అంటున్న ఈ సోషియో ఫాంటసీ వర్కౌట్ అయితే సౌత్ లో మరోసారి విజయ్ దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పొచ్చు, మరి ఈ న్యూస్ అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫాం అవుతుందో చూడాలి…