Home న్యూస్ 8 కోట్లు పెట్టి కొన్నాం…మాకు నష్టం వచ్చింది.. అంటూ విజయ్ దేవరకొండ పై నిర్మాత ఫైర్!!

8 కోట్లు పెట్టి కొన్నాం…మాకు నష్టం వచ్చింది.. అంటూ విజయ్ దేవరకొండ పై నిర్మాత ఫైర్!!

1

సినిమాలు అన్నాక ఒక సినిమా వలన లాభం ఒక సినిమా వలన నష్టం రావడం సహజమే… కానీ కొన్ని కొన్ని సార్లు భారీ నష్టాలు వచ్చినప్పుడు కొందరు హీరోలు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్ నుండి కొంత భాగాన్ని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ల కోసం ఇస్తూ ఉంటారు…కానీ ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లు….

హీరోల నుండి రెస్పాన్స్ రావాలని నిర్మాతలు తమ నష్టాలను పూడ్చాలని అడుగుతారు…చెప్పిన రేటు పెట్టి కొని లాభం వస్తుంది అనుకుంటే ఆ సినిమా వలన భారీ నష్టాలు వస్తే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఎఏం చేస్తాడు… రీసెంట్ గా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)…

తన ఖుషి(Kushi) సినిమాకు మంచి కలెక్షన్స్ వీకెండ్ లో రావడంతో సంతోష పడి తన ఫ్యాన్స్ లో 100 మందికి తలో లక్ష చొప్పున రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ ప్రకటించగా ఇది చూసి అందరూ ఆశ్యర్యపోయారు… కానీ విజయ్ దేవరకొండ నటించిన…

వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover) సినిమాను నైజాంలో 8 కోట్లకు కొన్న అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు GST తో కలిపి 9 కోట్లకు పైగా రికవరీ సొంతం చేసుకుంటేనే లాభాలను అందుకునే అవకాశం ఉండగా ఆ సినిమా టోటల్ రన్ లో 4 కోట్ల రేంజ్ లోనే…

షేర్ ని సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. అప్పటి నుండి హీరో కానీ టీం కానీ తమ నష్టాలను పూడ్చండి అంటూ ఎంత చెప్పినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ 1 కోటి డొనేషన్…

వార్తా విని ట్విట్టర్ లో తనకి వచ్చిన నష్టాన్ని కూడా పూడ్చాలి అంటూ ఓపెన్ ట్వీట్ వేయడంతో అది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఇలా ఒక హీరో మీద ఇంత నష్టం వచ్చింది అని ఓపెన్ గా చెప్పడం అందరినీ ఆశ్యర్య పరుస్తూ ఉండగా…

అదే టైంలో స్టార్ హీరోలు, స్టార్ కిడ్స్ సినిమాలకు కూడా నష్టాలు వచ్చాయని, కానీ ఎవ్వరూ ఇలా ఓపెన్ పోస్ట్ పెట్టలేదని, విజయ్ కి బ్యాగ్రౌండ్ లేదని ధైర్యంగా పోస్ట్ చేస్తున్నారని అనే వాళ్ళు ఉన్నారు. ఇక దీనిపై విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

1 COMMENT

Leave a Reply to Mee daddy Cancel reply

Please enter your comment!
Please enter your name here