బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన సినిమాలు వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) మరియు వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) పోటి పడగా…
ఓపెనింగ్ డే పరంగా బాలయ్య జోరు చూపించినా తర్వాత లాంగ్ రన్ పరంగా వాల్తేరు వీరయ్య ఓ రేంజ్ లో దుమ్ము లేపి సంక్రాంతి హిట్ గా నిలిచి వీర సింహా రెడ్డి మీద భారీ మార్జిన్ తో విజయాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ భారీ విక్టరీని సొంతం చేసుకోగా…
ఇప్పుడు టెలివిజన్ పరంగా మాత్రం మెగాస్టార్ మెగా బ్లాక్ బస్టర్ మీద బాలయ్య విజయాన్ని సొంతం చేసుకుని బెటర్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి సినిమాల్లో ముందుగానే టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా…
మొత్తం మీద మొదటి టెలికాస్ట్ లో 8.83 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాతో పోల్చితే చాలా లేట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ టెలికాస్ట్ లో అందరికీ శాకిస్తూ 5.14 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని….
టెలివిజన్ పోటిలో బాలయ్య వీర సింహా రెడ్డి కన్నా తక్కువ రేటింగ్ తో ఓడిపోయింది. కారణాలు ఏవి అయినా బాక్స్ ఆఫీస్ విక్టరీ మెగాస్టార్ ది అయితే టెలివిజన్ విక్టరీ బాలయ్యది అయ్యింది… ఇక ఈ ఇద్దరు హీరోలు తమ అప్ కమింగ్ మూవీస్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి…