Home గాసిప్స్ 7 ఏళ్ల క్రితం సినిమా…తెలుగు బిజినెస్ కన్నా శాటిలైట్ రైట్స్ కి ఎక్కువ రేటు!!

7 ఏళ్ల క్రితం సినిమా…తెలుగు బిజినెస్ కన్నా శాటిలైట్ రైట్స్ కి ఎక్కువ రేటు!!

1492
0

ఒక్క సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో తిరుగు లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న వాళ్ళలో ఇప్పుడు KGF హీరో రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకరు అని చెప్పాలి, ఆ ఒక్క సినిమా తో టోటల్ ఇండియా లోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యష్ కి తెలుగు లో కూడా ఆ ఒక్క సినిమా తోనే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా…

అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇక యష్ క్రేజ్ ను వాడుకోవడానికి తెలుగు లో కి యష్ నటించిన కన్నడ సినిమాలు ఒక్కోటి డబ్ చేయడం కూడా స్టార్ట్ అవ్వగా అందులో ముందుగా రిలీజ్ అయిన సినిమా గజకేసరి.

7 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగు లో అదే పేరు తో డబ్ చేసి సుమారు 150 థియేటర్స్ లో ఎలాంటి చడీచప్పుడు లేకుండా రిలీజ్ చేయగా థియేట్రికల్ బిజినెస్ 15 లక్షల దాకా రేటు ని సొంతం చేసుకుంది, కానీ జనాలకు తక్కువగానే ఈ సినిమా గురించి తెలియడం తో పెద్దగా జనాలు…

ఈ సినిమాని చూడటానికి థియేటర్స్ కి తరలి రాలేదు. దాంతో మొత్తం మీద టోటల్ రన్ లో 7 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ను జీ తెలుగు వాళ్ళు రీసెంట్ గా హక్కులను సాలిడ్ గా రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారు. సినిమా కి తెలుగు బిజినెస్ 15 లక్షల కన్నా కూడా శాటిలైట్ రైట్స్ కింద 22 లక్షల దాకా…

రేటు సొంతం అయ్యిందని అంటున్నారు. బిజినెస్ కన్నా శాటిలైట్ రైట్స్ ఎక్కువ పలకడం విశేషం అనే చెప్పాలి. టీవీ లో కూడా సినిమాను బాగా ప్రమోట్ చేసి టెలికాస్ట్ ను రీసెంట్ గా చేశారు. ఇక సినిమా కి TRP రేటింగ్ ఏ విధంగా వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here