నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ రిలీజ్ లోనే సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో బెటర్ గా హోల్డ్ చేసింది. తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయినా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి. దాంతో తొలిరోజు కలెక్షన్స్ లెక్క ఇప్పుడు…
సాలిడ్ గానే ఉండే అవకాశం ఉండగా నైజాంలో సినిమా మొదటి రోజు ఇప్పుడు 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునేలా ఉండగా టోటల్ ఆంధ్రలో 8 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం అంతకన్నా మించి ముందుకు వెళ్ళే…
ఔట్ రైట్ ఛాన్స్ కూడా పుష్కలంగానే ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో 2 కోట్ల నుండి 2.5 కోట్ల మధ్యలో గ్రాస్ ను, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా 14 కోట్ల నుండి 15 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…. ఈ రేంజ్ కలెక్షన్స్ ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా సొంతం చేసుకోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి. అన్ని చోట్లా అంచనాలను మించే వసూళ్లు వస్తే ఈ లెక్క కొద్దివరకు మించే అవకాశం ఉంది.
ఓవరాల్ గా నాని కెరీర్ లో రెండేళ్ళ తర్వాత ఈ సినిమాతో లిమిటెడ్ రిలీజ్ లోనే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు అని చెప్పొచ్చు. ఎలాగూ వీకెండ్ లో క్రిస్టమస్ కూడా కలిసి రావడం తర్వాత న్యూ ఇయర్ ఇలా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే ఛాన్స్ ఎంతైనా ఉంది. ఇక తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి….