Home న్యూస్ 19 ఏళ్ల సింహాద్రి…చాలా తక్కువమందికి తెలిసిన న్యూస్ ఇది!!

19 ఏళ్ల సింహాద్రి…చాలా తక్కువమందికి తెలిసిన న్యూస్ ఇది!!

0

హాయ్ ఫ్రెండ్స్ ఇది మా సైట్ కి ఒక ఎన్టీఆర్ అభిమాని పంపిన స్టోరీ. ఇది అతను ఎక్కడో చదివి రాశాడట. మనతో షేర్ చేసుకోవాలని ఆశపడి మాకు సెండ్ చేశాడు. ఒక్కసారి చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని ఓ రేంజ్ లో నిలిపిన సినిమా సింహాద్రి కి రీసెంట్ గా 19 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. 20 ఏళ్ల వయసులోనే తన ఏజ్ కి మించిన రోల్ లో అద్బుతనటనను కనబరిచిన ఎన్టీఆర్ అప్పటి స్టార్ హీరోల౦దరికీ వణుకు పుట్టించాడు,

కానీ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం చాలాకాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ కెరీర్ ని టోటల్ గా మార్చేసి తన ఫాలోయింగ్ ను 100 రెట్లు పెంచిన సినిమాగా సింహాద్రి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. కాగా ఈ సినిమా తెలుగులో….

#17YearsForIHSimhadri Became 2nd Biggest Anniversary Trend

సాధించిన ఆల్ టైం రికార్డు స్థాయి విజయాన్ని చూసి ఇతర ఇండస్ట్రీల వారు తమ భాషల్లో రీమేక్ చేయాలని పోటి పడ్డారు. తమిళ్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ కి స్పెషల్ షో వేసి చూపించ గా ఎన్టీఆర్ కెరీర్ గురించి ఆయన అప్పట్లోనే తెగ భాద పడ్డారని సమాచారం…

ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కొట్టడం చాలా కష్టం అన్నారు, ఆయన అన్నట్లుగానే జరిగింది. ఎన్ని చెప్పిన రజినీకాంత్ ఈ రీమేక్ చేయడానికి జంకడంతో మరో సూపర్ స్టార్ విజయ్ కాంత్ ఆ సినిమాను “గజేంద్ర” పేరుతో రీమేక్ చేశాడు, తరువాత కన్నడలో దునియా విజయ్ “కాంతీరవ్వ” పేరుతో రీమేక్ చేశాడు.

కానీ ఈ రెండు భాషల్లో కూడా సింహాద్రి రీమేక్ ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలింది. రెండు భాషల్లో నటించిన హీరోలు ఎన్టీఆర్ నటనలో 10% కూడా నటించలేదు అని విమర్శకులు రెచ్చిపోయారు. దాంతో తెలుగులో ఓ కుర్ర హీరో ఎలాంటి అంచనాలు లేకుండా సాధించిన విజయాన్ని ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రం అందుకోలేకపోయినట్లై౦ది.

అదే సమయం లో ఇది ఎన్టీఆర్ ఒక్కడే చేయగలిగిన పాత్ర అని మెచ్చుకున్నారట. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 12 కోట్ల లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని టోటల్ రన్ లో ఊరమాస్ అనిపించే లెవల్ లో 26.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రికార్డులను తిరగరాసింది…

ఇక సినిమా 50 డేస్ సెంటర్స్, కానీ 100 డేస్ సెంటర్స్ కానీ అద్బుతం అయితే 175 డేస్ సెంటర్స్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది… సో ఇది ఫ్రెండ్స్ అతను మనతో షేర్ చేసుకున్న ఓ స్పెషల్ స్టోరీ… మీ దగ్గర కూడా ఇలాంటి స్టోరీ ఉంటే వెంటనే మాకు సెండ్ చేయండి. ఈ అభిమాని పేరు సెండ్ చేయలేదు కానీ మీరు మీ పేరుతో మాకు స్పెషల్ ఆర్టికల్స్ ఏవైనా సెండ్ చేస్తే…..

వాటిని చూసి పబ్లిష్ చేసే విధంగా ఉంటే మీ పేరుతో పాటు ఆ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం కింద మీ ఆర్టికల్ ని మాకు ఈ మెయిల్ ఐడి కి పంపించండి మరి…[email protected]… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here