నాచురల్ స్టార్ నాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 ఏళ్ల తర్వాత తన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవ్వగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా లిమిటెడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. తక్కువ సెంటర్స్ లో రిలీజ్ అవ్వడానికి కారణం సినిమా కి ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన ఓన్ గా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా సినిమా తెలుగు లో…
ఓవరాల్ గా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా బుకింగ్స్ ముందే ఓపెన్ అవ్వగా నైజాంలో కుమ్మింది కానీ ఆంధ్రలో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అయ్యాయి, దాంతో రిలీజ్ రోజునే ఫుల్ ఫ్లేట్చుడ్ గా టికెట్ సేల్స్ స్టార్ట్ అవ్వగా షో షోకి కలెక్షన్స్ ని…..
ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిన సినిమా మొత్తం మీద మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా ఓపెనింగ్స్ ని అందుకోబోతుంది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల హోల్డ్ తో సినిమా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ కన్ఫాం అవ్వగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు…
రెండు తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ కౌంట్ వైజ్ ఇది ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 కోట్ల నుండి… 6.5 కోట్ల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంతకు మించి కలెక్షన్స్ వస్తే మెంటల్ మాస్ అనే చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఈ రేంజ్ వసూళ్ళని అందుకుంటుందా లేక ఈ అంచనాలను కూడా మించి పోయి ఇంకా దుమ్ము లేపుతుందో చూడాలి. ఇక అఫీషియల్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.