నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి ఆడియన్స్ నుండి సాలిడ్ టాక్ లభించింది అని చెప్పాలి. కానీ సినిమా కి ఆంధ్రలో ఎదురు అయిన పరిస్థితుల వలన లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ తో మరీ అనుకున్న రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకోలేక చాలా నార్మల్ గా రిలీజ్ అవ్వగా సినిమా బిజినెస్ కూడా…
చాలా ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆ బిజినెస్ వాల్యూస్ నైజాం లో 8 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు, టోటల్ ఆంధ్రలో 6 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 3.5 కోట్ల దాకా ఉండగా టోటల్ బిజినెస్ 22 కోట్ల దాకా ఉంది.
దాంతో సినిమా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 22.5 కోట్ల రేంజ్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వెరీ లిమిటెడ్ రిలీజ్ వలన సినిమా 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అనుకుంటే 4.17 కోట్ల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకసారి టోటల్ వరల్డ్ వైడ్ గా…
సినిమా మొదటి రోజు సాధించిన వసూళ్ళని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.12Cr(inc GST)
👉Ceeded: 62L
👉UA: 51L
👉East: 20L
👉West: 16L
👉Guntur: 26L
👉Krishna: 18L
👉Nellore: 12L
AP-TG Total:- 4.17CR(6.90CR~ Gross)
Ka+ROI: 1.30Cr
OS – 1.35Cr
Total WW: 6.82CR(12CR~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు సాధించిన వసూళ్లు.
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22.5 కోట్లు కాగా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 15.68 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో ఇంకా 35-40% పెరిగి ఉండేవి, ఆ ఇంపాక్ట్ ఉన్నా సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.