కోలివుడ్ స్టార్ హీరోస్ రజినీకాంత్ అండ్ విజయ్ సినిమాల క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రజినీ కొద్దిగా హిట్స్ లేక స్లో డౌన్ అవ్వగా విజయ్ వరుస విజయాలతో ఫుల్ జోరు మీదున్నాడు. ఇలాంటి సమయం లో ఈ సర్కార్ తో ఆల్ టైం రికార్డులను నమోదు చేశాడు విజయ్. మొదటి రోజు సర్కార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడు లో ఏకంగా 30 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసింది.
ఇక ఇప్పుడు ఆ రికార్డ్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కొంచం స్లో గా స్టార్ట్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే చాన్స్ ఉంది.
సర్కార్ అల్టిమేట్ ఆక్యుపెన్సీ తో దుమ్ము లేపగా… రోబో 2 ఆక్యుపెన్సీ తక్కువే ఉన్నా టికెట్ రేట్లు భారీ గా ఉండటం తో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కచ్చితంగా సర్కార్ డే 1 రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.