సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొత్తం మీద అన్ని ఏరియాల్లో రెండో వారం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది. మిగిలిన ఏరియాల పరిస్థితి ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ను టోటల్ గా 71 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా 13 రోజుల్లో 49 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.
కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 5 కోట్ల రేంజ్ వరకు షేర్ ని అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ఆశలు ఆవిరి అయినట్లే అని చెప్పాలి. నైజాం లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వబోతున్నా కానీ ఆంధ్రా మరియు సీడెడ్ లో నష్టాలూ….
భారీ గానే ఉండే అవకాశం ఉంది…ఫైనల్ రన్ లో తెలుగు లో 55 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో సినిమా డబ్బింగ్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసినా కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక 15 కోట్ల రేంజ్ లో నష్టాలు తేవడం ఖాయమని అంటున్నారు.