2019 ఇయర్ ఇప్పటికే ఆల్ మోస్ట్ 2 నెలలు ముగియ వచ్చింది, రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు పోయిన ఇయర్ తో పోల్చితే తక్కువ సినిమాలే వచ్చాయి, కానీ అందులో కొంచం క్రేజ్ ఉన్న సినిమా లే ఎక్కువ గా ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ మంచి విజయాలను నమోదు చేస్తాయి అనుకున్నా కానీ కొన్ని సినిమాలు మాత్రమే కొంతో గొప్పో కలెక్షన్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ జోరు చూపాయి.
ఓవరాల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో తెలుగు డబ్బింగ్ సినిమాలతో కూడా కలిపి మొదటి రోజు హైయెస్ట్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న టాప్ సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండీ.. కొన్ని సినిమాల హైర్స్ కూడా కలిపి ఈ లిస్టులో జోడిస్తున్నాం.
రామ్ చరణ్ వినయ విధేయ రామ: 26.06 కోట్లు
బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు: 8 కోట్లు
వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్: 4.7 కోట్లు
అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను: 3 కోట్లు
మమ్ముట్టి యాత్ర: 2.26 కోట్లు
రజినీ కాంత్ పేట: 1.75 కోట్లు
బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు: 1.59 కోట్లు
కార్తీ దేవ్: 80 లక్షలు
ప్రియా ప్రకాష్ వారియర్ లవర్స్ డే: 73 లక్షలు
ఇవీ ఓవరాల్ గా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో తొలి 2 నెలల్లో ఎక్కువ వసూళ్లు అందుకున్న టాప్ సినిమాలు.. ఈ లిస్టులో మొదటి రోజు దుమ్ము లేపిన వినయ విధేయ రామ సినిమా కలెక్షన్స్ లో మొత్తంగా 8.8 కోట్ల వరకు హైర్స్ కలెక్షన్స్ యాడ్ అయ్యాయి. అది మిగిలిన సినిమాల కన్నా ఎక్కువ.
ఇక విజయాల విషయంలో ఒక్క వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మాత్రమె తొలిరోజు లిమిటెడ్ థియేటర్స్ లో తక్కువ కలెక్షన్స్ తో ఓపెన్ అయిన ఊహకందని లెవల్ లో 81 కోట్లకు పైగా షేర్ తో దుమ్ము లేపింది. ఇక మీదట వచ్చే సినిమాలకు ఈ ఇయర్ బెంచ్ మార్క్ సెట్ చేసింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.