బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన సినిమా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకునే దిశగా పరుగును కొనసాగించ లేదు…దాంతో సినిమా…
ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ఎపిక్ లాస్ లను సొంతం చేసుకుని షాకిచ్చింది…ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మేజర్ సెంటర్స్ లో సినిమా అన్ని ఏరియాల్లో కూడా సాలిడ్ గానే లాస్ లను సొంతం చేసుకోగా… కాగా సినిమా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో…
ఆల్ మోస్ట్ లాస్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి.. రాయలసీమ ఏరియాలో సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న బయ్యర్లు ఏకంగా 23 కోట్ల మమ్మోత్ రేటుని రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు ల కాంబోని నమ్మి కొన్నారు.. సినిమా మొదటి రోజు నుండే ఇక్కడ పెద్దగా…
ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది..దాంతో ఏ దశలో కూడా తేరుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరగానే రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా సీడెడ్ లో 10.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది ఇప్పుడు…
ఓవరాల్ గా 23 కోట్ల బిజినెస్ లో 10.45 కోట్ల రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఏకంగా 12.55 కోట్ల రేంజ్ లో లాస్ ను ఇక్కడ దక్కించుకుని ఎపిక్ డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా హెవీ లాస్ లనే సొంతం చేసుకున్నా ఇక్కడ నష్టాలు భారీ ఎదురుదెబ్బ తీశాయి…