Home న్యూస్ 24 గంటలు ఓవర్ పక్కా కమర్షియల్ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్ పక్కా కమర్షియల్ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!

703
0

యాక్షన్ హీరో గోపీచంద్ మారుతి ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ సినిమా ఆడియన్స్ ముందుకు త్వరలోనే రావడానికి సిద్ధం అవుతూ ఉంది, రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకున్న తర్వాత ఈ మధ్యే సీటిమార్ సినిమాతో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పక్కా కమర్షియల్ తో మరోసారి ఇంప్రెస్ చేసే అవకాశం ఎంతైనా కనిపిస్తుండగా….

రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను ఈ టీసర్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి ఈ టీసర్ కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ లెక్క 4.15 మిలియన్స్ మార్క్ ని అందుకోగా…

లైక్స్ పరంగా ఆల్ మోస్ట్ 150.4K లైక్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది, స్టైలిష్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో మంచి హిట్ కొడితే గోపీచంద్ ఈ మధ్య కోల్పోయిన టోటల్ మార్కెట్ చాలా వరకు సెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here