టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ముగించుకుంది. సినిమా నాలుగో వీకెండ్ మొత్తం మీద 50 లక్షలకు పైగా షేర్ ని అందుకుంది. కాగా సినిమా టోటల్ గా 26 రోజుల్లో 98.35 కోట్ల షేర్ ని 163.8 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 వ రోజున రెండు రాష్ట్రాలలో మరిన్ని థియేటర్స్ ని కోల్పోయింది.
మొత్తం మీద సినిమా సోమవారం నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర 150 వరకు థియేటర్స్ లో ఆడుతుంది. కాగా సండే తో పోల్చుకుంటే సోమవారం కలెక్షన్స్ భారీగానే డ్రాప్ అయ్యాయి. సవ్యసాచి సోమవారం కొంతవరకు హోల్డ్ చేయగా దసరా సినిమాలు భారీ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నాయి.
ఉన్నంతలో అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సోమవారం మొత్తం మీద 5 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే ఛాన్స్ ఉంది. కర్నాటకలో సినిమా రోజుకి మొత్తం మీద 12 షోలు మాత్రమే సోమవారం నుండి ప్రదర్శితం అవుతున్నాయి.
అక్కడ సినిమా కలెక్షన్స్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేశాయనే చెప్పాలి. దీపావళి వీకెండ్ తర్వాత రన్ ని కంప్లీట్ చేసుకోనుంది. ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే 19 వ రోజు రెండు రాష్ట్రాలలో 6 నుండి 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది.
ఇక పందెం కోడి 2 పరుగుని కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి. ఇక సవ్యసాచి సినిమా సోమవారం కలెక్షన్స్ సగానికి పైగానే డ్రాప్స్ ని అందుకున్న ఈవినింగ్ షోల లో కొంత గ్రోత్ తో రోజు ని 80 లక్షల నుండి 1 కోటి లోపు వసూళ్ల తో ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.