ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా, చాలా లేట్ గా రిలీజ్ అయినా కూడా రీసెంట్ గా సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ అయ్యి మాస్ రచ్చ చేసింది. విశాల్(Vishal) నటించిన ఓల్డ్ మూవీ మద గజ రాజ(Madha Gaja Raja) మూవీ తమిళనాడులో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా తెలుగు లో రీసెంట్ గా..
డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమాకి ఇక్కడ ఆడియన్స్ నుండి ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో సొంతం అవ్వలేదు అనే చెప్పాలి. మొదటి రోజు 40 లక్షల లోపే గ్రాస్ ను అందుకున్న సినిమా రెండో రోజు కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా 35 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 40 లక్షల లోపు షేర్ ని ఓవరాల్ గా అందుకుందని అంచనా..
సినిమా తెలుగు వర్షన్ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇంకా సాలిడ్ గాజోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా తమిళనాడులో 52 కోట్లకు పైగా గ్రాస్ ను…
అందుకోగా తెలుగు కర్ణాటకలో కలిపి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో సినిమా 54 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు లో మాత్రం సినిమా ఒకింత నిరాశ పరిచింది అని చెప్పాలి… ఇక వీకెండ్ లో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.