నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని రెండో రోజు సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు అని చెప్పాలి. క్లాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని దక్కించుకోగా మాస్ సెంటర్స్ లో కొంచం తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా రెండో రోజు మొదటి రోజు తో పోల్చితే 25-30% వరకు డ్రాప్స్ మాత్రమే కనిపించడం విశేషం.
దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 2 వ రోజున 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయినా కానీ ఇది ఓవరాల్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ అని చెప్పొచ్చు. ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్…
లెక్కలు కూడా బాగుంటే 3.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా వరల్డ్ వైడ్ గా రెండో రోజు 4.2 కోట్ల నుండి 4.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిన రేంజ్ కి ఇది సెన్సేషనల్ డే 2 అని చెప్పొచ్చు. ఇక రెండు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.