Home న్యూస్ 2nd DAY పట్టుదల మూవీ కలెక్షన్స్…ఇది అస్సలు ఊహించలేదు!!

2nd DAY పట్టుదల మూవీ కలెక్షన్స్…ఇది అస్సలు ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ టాక్ ని తెచ్చుకున్నా కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగు లో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా ఇక్కడ ఓపెనింగ్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది.

మొదటి రోజు నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజున సినిమా కి పోటిగా తండేల్ మూవీ ఉండటంతో సినిమా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇక్కడ. ఇక సినిమా ఉన్నంతలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…

ఓవరాల్ గా 30 లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా తమిళనాడులో సినిమా మొదటి రోజు కుమ్మేసినా కూడా రెండో రోజు టాక్ ఇంపాక్ట్ చూపించడంతో డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది…

అక్కడ ఆల్ మోస్ట్ మొదటి రోజుతో పోల్చితే 65% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా, ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా అక్కడ 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు ఏమైనా బాగుంటే డబుల్ డిజిట్ మార్క్ ని టచ్ అండ్ గో చేయోవచ్చు.

ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉన్న నేపధ్యంలో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే..

కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, కానీ రెండో రోజు సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here