చిన్న సినిమాలకు, కొన్ని ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలకు ఉండే అడ్వాంటేజ్, టాక్ పాజిటివ్ గా వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువగా వచ్చినా కానీ తర్వాత రోజుల్లో గ్రోత్ ని చూపెట్టే అవకాశం ఉంటుంది. అలా కొన్ని సినిమాలకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటిదే రీసెంట్ గా రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ వరుణ్ డాక్టర్ విషయం లో జరిగింది అని చెప్పాలి.
ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు 22 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు సాలిడ్ గ్రోత్ ని చూపెట్టి 37 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకుంది, వీకెండ్ ముగిసింది, వర్కింగ్ డే లో మూడో రోజు మొదలు పెట్టిన ఈ సినిమా…
టాక్ పాజిటివ్ గా ఉండటం తో మూడో రోజు వర్కింగ్ డే అయినా హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని 24 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా మూడు రోజుల తెలుగు రాష్ట్రాల సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 23L
👉Ceeded: 11L
👉UA: 11L
👉East: 8L
👉West: 7L
👉Guntur: 8L
👉Krishna: 9L
👉Nellore: 6L
AP-TG Total:- 0.83CR(1.46CR~ Gross)
ఇదీ సినిమా తెలుగు లో 3 డేస్ కలెక్షన్స్. 1.35 కోట్ల బిజినెస్ ని అందుకున్న సినిమా 1.6 కోట్ల లోపు టార్గెట్ ని అందుకోవాల్సి ఉండగా ఇంకా 77 లక్షల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంది.
ఇక సినిమా తమిళనాడులో 3 వ రోజు వర్కింగ్ డే అయినా 4.5 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకుందట, దాంతో 3 రోజుల తమిళ్ నాడు కలెక్షన్స్ 19.3 కోట్లు కాగా….3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో ఉందని అంటున్నారు. దాంతో అక్కడ కూడా సినిమా రాంపేజ్ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పొచ్చు.