నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి రెండు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అవ్వగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మోడో వారంలో కొత్త సినిమాల నుండి పోటి వలన థియేటర్స్ కొద్దివరకు కోల్పోవాల్సి వచ్చింది, అయినా కానీ ఉన్నంతలో మంచి హోల్డ్ నే ఓవరాల్ గా సొంతం చేసుకుంది అని చెప్పాలి.
సినిమా మొత్తం మీద రెండో వారంలో 425 థియేటర్స్ ని హోల్డ్ చేయగా మూడో వారంలో సినిమా నైజాంలో 116 థియేటర్స్ ని, సీడెడ్ లో 55 థియేటర్స్ ని ఆంధ్రలో 110 థియేటర్స్ ని హోల్డ్ చేసింది, దాంతో మొత్తం మీద సినిమా మూడో వీక్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో…
280 థియేటర్స్ ని హోల్డ్ చేసింది, ఇదే టైం లో అఖండ 6 వ వారంలో అలాగే పుష్ప 4 వ వారంలో ప్రీవియస్ వీక్స్ పోల్చితే థియేటర్స్ కౌంట్ పెరగగా ఈ సినిమా కి మాత్రం థియేటర్స్ తగ్గాయి. అయినా కానీ క్లాస్ కంటెంట్ కి ఇలా థియేటర్స్ ని హోల్డ్ చేయడం కూడా విశేషమే… ఇక సినిమా ఈ వారంలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.