బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఫ్యామిలీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది…సరైన సినిమా పడితే ఓ రేంజ్ లో హిట్ కొట్టే సత్తా ఉందని ఆల్ రెడీ ఎఫ్2, ఎఫ్ 3 లాంటి సినిమాలు నిరూపించాయి…కానీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఫ్యామిలీ కాకుండా ఓ సీరియస్ సబ్జెక్ట్ తో సైంధవ్ అంటూ సినిమాతో వచ్చాడు వెంకీ…
ఆ సినిమా కి అనుకున్న రేంజ్ లో బజ్ రాలేదు…బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ వీర విహారం ముందు ఈ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేదు. దాంతో సంక్రాంతికి భారీ ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ మళ్ళీ ఏడాది తిరిగే సరికి అదే సంక్రాంతికి తనతో ఎఫ్2, ఎఫ్3 సినిమాతో దుమ్ము లేపిన…
అనిల్ రావిపూడితో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie)సినిమాతో సందడి చేయగా పోటిలో భారీ పాన్ ఇండియా మూవీ అలాగే హాట్రిక్ హిట్స్ కొట్టిన మరో హీరో సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఓ రేంజ్ లో బజ్ ను సొంతం చేసుకుని తొలిరోజు రికార్డ్ లెవల్ హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేశాడు….
ఎక్కడైతే సంక్రాంతికి ఎపిక్ ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్నాడో అదే సంక్రాంతికి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డ్ ను సైతం నమోదు చేసి సంచలనం సృష్టించాడు ఇప్పుడు. సైంధవ్ మూవీ మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 5.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా….ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ…
మొదటి రోజున ఏకంగా 40 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఊహకందని రాంపెజ్ ను చూపించింది…. ఇక ఎఫ్ 3 మూవీ మొదటి రోజున 13.65 కోట్ల షేర్ మార్క్ తో ఇది వరకు వెంకీ కెరీర్ బెస్ట్ గా నిలిస్తే ఇప్పుడు ఆ రికార్డ్ ను సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి మొదటి రోజు…
ఏకంగా 23.5 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ తర్వాత సెన్సేషనల్ మాస్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని కెరీర్ లో మొదటి సారిగా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు విక్టరీ వెంకటేష్…