బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా మొదటి నుండి అనేక కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అవ్వడం తో ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా ను బ్యాన్ చేయగా అక్కడ తప్పితే వరల్డ్ వైడ్ గా సినిమా భారీ గా రిలీజ్ అయ్యింది, ఓవర్సీస్ నుండి పర్వాలేదు అన్న టాక్ ని సొంతం చేసుకోగా రెగ్యులర్ షోల టాక్ వచ్చేసింది.
స్టొరీ పాయింట్: 1989 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ కి పార్టీ అలాగే కుటుంబం కొంత వరకు దూరం అవుతుంది, అప్పుడు జీవిత కథ రాస్తాను అంటూ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లో ఎంటర్ అయ్యాక పార్టీ లో కుటుంబంలో జరిగిన గొడవలు,
ఇలాంటివి, ఇవన్నీ తట్టుకుని తర్వాత ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎలా గెలిచారు, గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ పాయింట్. స్టొరీ అందరికీ తెలిసిందే అయినా ఇది ఈ కాలం యూత్ కి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ.
పెర్ఫార్మెన్స్: లీడ్ పాత్రలు అన్నీ తమ పరిది మేర నటించి మెప్పించాయి. చంద్రబాబు పాత్ర పోషించిన వ్యక్తి నటన కి మంచి మార్కులు పడ్డాయి, ఎన్టీఆర్ గారిలా నటించిన వ్యక్తి ఒకే అనిపించుకోగా లక్ష్మీ పార్వతి గా నటించిన ఆమె కూడా మంచి మార్కులే సాధించింది.
హైలెట్స్:
*అనుకున్న కథ ని అనుకున్నట్లే తీసి మెప్పించాడు వర్మ
* సెకెండ్ ఆఫ్
*సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్
*కొన్ని డైలాగ్స్ చప్పట్ల వర్షం కురిసేలా ఉన్నాయి
*క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషన్ టచ్ తో ఆకట్టుకుంటుంది.
ఇవీ మొత్తం మీద సినిమాలో హైలెట్ గా నిలిచే పాయింట్స్ అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్:
*కథ ని సాగదీయడం
* చాలా సన్నివేశాలు కేవలం ఎన్టీఆర్ – లక్ష్మీ పార్వతి పైనే తీయడం
* డార్క్ థీం
*కొన్ని విచిత్రమైన వర్మ మార్క్ కెమరా యాంగిల్స్
* స్లో నరేషన్
సినిమా లో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే, సినిమా ముఖ్యంగా డార్క్ థీం తో తీయడం కొన్ని సార్లు ఇబ్బంది పెడుతుంది.
విశ్లేషణ: రామ్ గోపాల్ వర్మ మరియు అగస్త్యలు కలిసి డైరెక్షన్ చేసిన ఎక్కువ ట్రీట్ మెంట్ వర్మ మార్క్ తోనే ఉంటుంది, కథ లో డైరెక్ట్ గా వెళ్ళినా తర్వాత ఒక్కో సీన్ కొంచం ఆసక్తిగా కొంచం బోర్ కొడుతూ ఇంటర్వెల్ వరకు వెళ్ళగా సెకెండ్ ఆఫ్ లోనే మేజర్…
కథ మొదలు అవ్వగా అక్కడ వర్మ తన మార్క్ ని చూపెట్టి మెప్పించాడు. కానీ సినిమా చూసిన తర్వాత ఇది అసలు కథ కాదని, కేవలం లక్ష్మీ పార్వతి అనుకున్న కథ అని చూస్తున్న ఆడియన్స్ ఫీల్ అవ్వడం ఖాయం. కళ్యాణి మాలిక్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత బాగుంటే సినిమా లెవల్ మరింతగా పెరిగేది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఇది వర్మ కంబ్యాక్ మూవీ నే అయినా ఫుల్ సాటిస్ ఫై గా మాత్రం ప్రేక్షకులు తిరిగి రాలేరు.
మొత్తం మీద సినిమా కొన్ని పార్టీలకు పొలిటికల్ గా బాగా హెల్ప్ అయ్యే విధంగా ఉండగా, అసలు కథ అని చెప్పినా ఇదే అసలు నిజం కాదు అని చూసే ఆడియన్స్ యిట్టె పసిగట్టగలరు. మొత్తం మీద సినిమా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్.