చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బలంగా ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికే పలు చిన్న సినిమాలు తెలుగు చిత్రసీమలో విజయఢంకా మోగించి సత్తా చాటాయి. ఇలాంటి కోవలోకి చెందిన మరో సినిమానే ‘పద్మ శ్రీ’. కరోనా పరిస్థితుల్లో పెద్ద సినిమాలే వెనకడుగేస్తుండగా.. కథ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బరిలోకి దిగుతోంది పద్మ శ్రీ టీమ్.
ఎస్. ఎస్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ఎస్ పట్నాయక్ రచన, దర్శకత్వంలో కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హారర్ మూవీగా ఈ పద్మశ్రీ సినిమాను రూపొందించారు. ప్రముఖ మెజీషియన్, హిప్నాటిస్ట్ బేతా శ్రీనివాసరాజు సమర్పిస్తున్న చిత్రానికి సదాశివుని శిరీష నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. హైదరాబాద్, ఆలంపూర్, ఉత్తరాంధ్ర లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపి భారీ సాంకేతిక విలువలతో మెరుగైన అవుట్‌పుట్ తీసుకొచ్చారు.
పెద్ద సినిమాలే రిలీజ్ చేయడానికి తర్జన భర్జన అవుతుండగా ఎంతో ధైర్యంగా ఈ పద్మ శ్రీ సినిమాను జనవరి 22న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం రూపొందించడంలో దర్శకనిర్మాతల కృషి, డైరెక్టర్ ఎస్. ఎస్ పట్నాయక్ ఆత్మ విశ్వాసం చూసి మంత్రి పేర్ని నాని అభినందించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్ లుక్ ను నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆడియోను సంగీత దర్శకుడు కోటి లు ఆవిష్కరించారు. వారి చేతులు మీదుగా రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
నటీనటులు: జ్యోతి (టైటిల్ రోల్), కిషోర్ కుమార్, కనికా ఖన్నా, రావిపల్లి సంధ్యారాణి, ఎస్. ఎస్ పట్నాయక్, మరుపల్లి సతీష్, హర్ష కశ్యప్, కాళీ చరణ్, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, చక్రవర్తి, జయ, రమ్య శ్రీ, AV రమణ మూర్తి, పూజారి లక్ష్మణ రావు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఎస్. ఎస్ పిక్చర్స్
రచన, దర్శకత్వం: ఎస్. ఎస్ పట్నాయక్
నిర్మాత: సదాశివుని శిరీష
సహ నిర్మాతలు: మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ, PVS రామ్మోహన రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: pvg కృష్ణంరాజు, M. నర్సింగరావు
ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు
ఎడిటింగ్ : కంబాల శ్రీనివాస రావు
ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వర రావు
ఫైట్స్: దేవరాజు మాస్టర్
సంగీతం: జాన్ పోట్ల
కొరియోగ్రాఫర్స్: వెంకట్, తారక్