బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్ అయ్యి నిరాశ పరిచింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల దాకా….
కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని భావించినా కానీ మొత్తం మీద 77 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 93 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమె సినిమా సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఇక టోటల్ గా 5 డేస్ కి గాను…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.03Cr
👉Ceeded: 2.70Cr
👉UA: 2.15Cr
👉East: 1.18Cr
👉West: 1.07Cr
👉Guntur: 1.80Cr
👉Krishna: 85L
👉Nellore: 58L
AP-TG Total:- 15.36CR(23.65Cr~ Gross)
👉KA+ ROI: 85L
👉OS: 58L
👉Tamil – 90L~ est
Total World Wide: 17.69CR(29.70CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినా 5 రోజుల తర్వాత ఇంకా 21.31 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి ఇక సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే నని చెప్పాలి ఇప్పుడు ఓవరాల్ గా….
సినిమా 5వ రోజు హోల్డ్ చేసిన తీరు చూసిన తర్వాత… ఓన్లీ తెలుగు వర్షన్ వరకు సినిమా హిట్ అవ్వాలి అంటే 35 కోట్ల మార్క్ ని అందుకోవాలి. ఆ మార్క్ కి ఇంకా సినిమా 18.21 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో లాస్ ను ఎంతవరకు కవర్ చేసుకుంటుందో చూడాలి.