టాలీవుడ్ పవర్ స్టార్ Pawan Kalyan నటించిన ఎపిక్ క్లాసిక్ లవ్ స్టొరీ Tholi Prema సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లని పూర్తీ చేసుకుంది. అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అలాంటి ఈ సినిమా ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండ్ అయిన రీ రిలీజ్ లో భాగంగా ఏదైనా పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకున్నప్పటికీ కూడా సినిమా నిర్మాతలు మాత్రం సినిమా రీ రిలీజ్ ను ఎలాంటి అకేషన్ లేకుండానే…
25 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా ఈ నెల 30 న రీ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అది కూడా మామూలు రిలీజ్ కాదు ఏకంగా భారీ రిలీజ్ కి ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు సినిమాను ఏకంగా 300 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ రీ రిలీజ్ ను ఇలా నార్మల్ టైంలో రిలీజ్ చేయడం పై ఫ్యాన్స్ కొంత కోపంగా ఉన్నప్పటికీ బెస్ట్ క్వాలిటీతో సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏకంగా 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.