బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశమే లేక పోగా సినిమా ఎపిక్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకోవాల్సి వచ్చింది.
ఆల్ మోస్ట్ 85 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. కొన్న బయ్యర్లు సైతం భారీగా…నష్టాలను సొంతం చేసుకోవాల్సి రాగా అటు నాన్ థియేట్రికల్ రైట్స్, ఇటు థియేట్రికల్ రైట్స్ రెండూ కలిపినా కూడా మేకర్స్ కి బయ్యర్స్ కి…..
నష్టాలు వచ్చేలా చేసిన ఈ సినిమా త్వరగా డిజిటల్ లో రిలీజ్ చేసి కొంచం నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్….ఎంతో కొంత అభిమానులను కామన్ ఆడియన్స్ ను అలరించేలా సినిమాను మార్చాలను టోటల్ ఫుటేజ్ ను తిరిగి జమ చేసి ఎడిటింగ్ కి మరింతగా పని కల్పిస్తూ…..
సినిమాను రీ ఎడిట్ చేసి ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నారు… ఇది కూడా కొంచం అదనపు ఖర్చుతో కూడుకున్నదే అయినా…మేకర్స్ వెనకడుగు వేయడం లేదు, రిలీజ్ కి ముందు రోజు ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న సినిమాను సడెన్ గా రిలీజ్ చేసి భారీ ఎదురుదెబ్బ తిన్న టీం OTT లో అయినా…
ఆడియన్స్ ను మెప్పించాలి అని భావిస్తున్నారు. జూన్ 23న సినిమా సోని లివ్ లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా కానీ టీం ఆడియన్స్ ను ఇలాగైనా మెప్పించాలని చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే…మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.