Home న్యూస్ బాబాయ్ తోనే థియేటర్స్ లో అబ్బాయ్…ఇక రచ్చ రచ్చే!

బాబాయ్ తోనే థియేటర్స్ లో అబ్బాయ్…ఇక రచ్చ రచ్చే!

1039
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజు థియేటర్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సందడి చేసే అవకాశం ఎంతైనా ఉందని లేటెస్ట్ టాలీవుడ్ టాక్ అని చెప్పాలి.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న భారీ మైతలాజికల్ కాన్సెప్ట్ మూవీ బింబిసార మోషన్ పోస్టర్ నుండే మంచి హైప్ ను సొంతం చేసుకోగా తర్వాత సినిమా గురించిన ఎలాంటి అప్ డేట్ ఏమి రాలేదు, కానీ ఇప్పుడు సినిమా అతి త్వరలోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తూ ఉండగా సినిమా…

అఫీషియల్ టీసర్ మరియు ట్రైలర్ లు రెండూ కూడా రీసెంట్ గా సెన్సార్ ని కంప్లీట్ చేసుకోగా డిసెంబర్ 2న అఖండ తో థియేటర్స్ లో అయితే టీసర్ లేదా ట్రైలర్ ఏదైనా ఒకటి అటాచ్ చేసి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. దాంతో థియేటర్స్ లో బాబాయ్ తో పాటు అబ్బాయ్ కూడా సందడి చేయడం ఆల్ మోస్ట్ ఖాయమని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here