మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం ప్రయోగాత్మక సినిమా నే అయినా సోలో గా రిలీజ్ ని ఎంచుకోకుండా భారీ పోటి లో రిలీజ్ అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత ప్రతికూలత గా మారింది. సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఆడియన్స్ సినిమా ను వేరే సినిమాల టికెట్స్ దొరకక పొతే నే ఆప్షన్ గా పెట్టుకున్నారు. దాంతో తొలిరోజు కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేసింది ఈ సినిమా.
మినిమమ్ రెండు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ఖాయం అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా 1.21 కోట్ల షేర్ ని అందుకుంది, కానీ ఓవర్సీస్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేయడంతో తొలిరోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా..
1.9 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. రెండు వరుస సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన సినిమా ఇలా లో ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవడానికి కారణం పోటి లో రిలీజ్ అవ్వడమే. సోలో గా రిలీజ్ అయ్యి ఉంటె ఓపెనింగ్స్ కచ్చితంగా 3 కోట్ల రేంజ్ లో ఉండేవి. సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.