Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీసర్ రివ్యూ…..కళ్యాణ్ రామ్ కి భారీ హిట్ ఖాయం!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీసర్ రివ్యూ…..కళ్యాణ్ రామ్ కి భారీ హిట్ ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పటాస్ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకుని తర్వాత 118 మూవీ తో ఒక హిట్ ను తర్వాత బింబిసార తో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ను కొట్టినా కూడా కళ్యాణ్ రామ్(Kalyan Ram) కి మధ్యలో వరుసగా ఫ్లాఫ్స్ అలాగే నిరాశ పరిచే సినిమాలు చాలానే రాగా ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా…

ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు కళ్యాణ్ రామ్ హీరోగా సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా అఫీషియల్ టీసర్ ను ఇప్పుడు రిలీజ్ అవ్వగా టీసర్ క్వాలిటీ ఔట్ పుట్ చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గానే వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సినిమా…..కథ పాయింట్ ను కూడా టీసర్ లో కొద్ది వరకు రివీల్ చేయగా…

ఒక సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ అయిన విజయశాంతి కొడుకు కూడా తన లానే సిన్సియర్ పోలిస్ అవ్వాలని అనుకుంటుంది…కానీ సిటీలో జరుగుతున్న అల్లర్లు ఇతర గొడవలను పోలిస్ లా సాల్వ్ చేయడం కన్నా ఒక రౌడీగానే సాల్వ్ చేయోచ్చు అని ఫిక్స్ అయ్యే..

హీరో తన తల్లికే ఎదురు తిరుగుతాడు….ఇక తల్లికి కొడుకుకి మధ్య జరిగే గొడవలు….తల్లి పై ఎంత ప్రేమ ఉన్నా హీరో చేసే పనులు తల్లికి నచ్చకపోవడంతో తర్వాత కథ ఏమయింది అన్నది అసలు కథగా టీసర్ లో చూపించగా…కొంచం పటాస్ ను డిఫెరెంట్ యాంగిల్ లో…

చెప్పబోతున్నట్లు అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ తల్లి కొడుకుల సీన్స్ మంచి ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టీసర్ రేంజ్ లోనే ఇంప్రెస్ చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది…ఇక టీసర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here