Home న్యూస్ గాడ్ ఫాదర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

గాడ్ ఫాదర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి వచ్చేశాడు, సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా కానుకగా సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలోకి దించగా సినిమా పై ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా హైప్ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుని మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…..

రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోవడంతో CM సీట్ కి నయనతార మరియు సత్యదేవ్ లు ముందు నిలుస్తారు, పార్టీలో కొన్ని గొడవలు జరుగుతూ ఉండగా ఇవన్నీ గమనిస్తున్న బ్రహ్మా అయిన చిరంజీవి ఎలా తన మైండ్ గేమ్ తో ఎత్తుగడలు వేశాడు, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

ఒరిజినల్ కోర్ స్టొరీ పాయింట్ ని అలాగే తీసుకున్నా దానికి చాలా మార్పులే చేశాడు డైరెక్టర్ మోహన్ రాజా, పాత్రలను తీర్చిదిద్దిన విధానం చేసిన మార్పులు చాలా వరకు మెప్పించడం విశేషం. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ తన రోల్ లో అదరగొట్టేశాడు… లుక్స్ బాగున్నాయి, ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. డైలాగ్స్ చాలా బాగా రాశారు, ఆచార్య పోల్చితే చాలా ఎనర్జీతో కుమ్మేశాడు మెగాస్టార్, ఇక నయనతార తన రోల్ కి ఫుల్ న్యాయం చేయగా సత్యదేవ్ కూడా బాగా నటించాడు. ఇక సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చాలా ఓవర్ ది టాప్ గా ఉన్నా ఆడియన్స్ కి ఆ మూమెంట్ లో బాగానే నచ్చుతుంది.

మిగిలిన యాక్టర్స్ అందరూ తమ వరకు బాగానే మెప్పించారు, సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ లో తమన్ కుమ్మేశాడు, ట్రైలర్ లో యావరేజ్ అనిపించినా సినిమాలో మాత్రం తమన్ తన వర్క్ అద్బుతంగా చేశాడు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు, ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మోహన్ రాజా లూసిఫర్ కి చాలా వరకు చేసిన చేంజెస్ అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్టాఫ్ వరకు కథ కొంచం రొటీన్ గానే అనిపించినా అక్కడక్కడా వచ్చిన హీరో ఎలివేషన్స్ ఆకట్టుకోగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా కొంచం స్లో అయినా ఫస్టాఫ్ కన్నా బెటర్ గా ఉండి మొత్తం మీద ఆడియన్స్ ఫుల్ సాటిస్ ఫైతో థియేటర్స్ బయటికి వస్తారు….

మొత్తం మీద సినిమాలో మెగాస్టార్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, చిరు సల్మాన్ ల క్లైమాక్స్ ఎపిసోడ్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సెకెండ్ ఆఫ్ చాలా వరకు బాగుండటం ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ కొంచం టేక్ ఆఫ్ కి టైం పట్టడం, కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్, అక్కడక్కడా లాగ్ అవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఆచార్య రిజల్ట్ చూసి లూసిఫర్ ని ఆల్ రెడీ చూసిన వాళ్ళు చాలా తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళతారు.

అలాంటి వాళ్ళకి సినిమా చాలా వరకు అంచనాలను అందుకుని చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది… ఇక లూసిఫర్ సినిమా చూడని వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది సినిమా. మొత్తం మీద సినిమాతో మెగాస్టార్ ఆచార్య రిజల్ట్ ను మరిపించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here