కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద మంచి అంచనాలు ఉండగా టీసర్ ట్రైలర్ లు కూడా డీసెంట్ బజ్ ను క్రియేట్ చేశాయి. మరి సినిమా ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ స్టర్స్ లో ఒకరైన హీరో తన వైఫ్ కోసం అన్నీ వదిలేసి జైలుకి వెళతాడు…కానీ తన గతం వలన ఇబ్బందు ఎదురుకుంటూ ఉండగా తన కొడుకు సమస్యలో ఉన్నాడని తెలుసుకుని తిరిగి వచ్చాక హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ…
కథ పరంగా చాలా రొటీన్ కథతోనే తెరకేక్కినా కూడా డైరెక్టర్ వింటేజ్ అజిత్ ను ఆడియన్స్ కి తిరిగి అందించాడు…అజిత్ ఫ్యాన్స్ కి అయితే సినిమాలో చాలా వరకు ఫుల్ మీల్స్ పెట్టె సీన్స్ తో నింపేశాడు అని చెప్పాలి. ఓల్డ్ సినిమాలు సాంగ్స్ రిఫరెన్స్ లు….ఎలివేషన్ సీన్స్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి.
ఫస్టాఫ్ లో అయితే కొంచం స్లో స్టార్ట్ తర్వాత అజిత్ సీన్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా మెప్పించాయి అని చెప్పాలి. ఇంటర్వెల్ వరకు ఫుల్ హై ఇచ్చి తర్వాత అదే హై ని కంటిన్యూ చేస్తూ కొంత భాగం మెప్పించగా తర్వాత సినిమా స్లో అవ్వడం స్టార్ట్ అయ్యింది.
లాస్ట్ 40-45 నిమిషాలు కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించినా కూడా చాలా వరకు సినిమా ఫ్యాన్స్ ని ఫుల్ సాటిస్ ఫై చేస్తుంది. అదే టైంలో రెగ్యులర్ ఆడియన్స్ ను కూడా ఈ మధ్య అజిత్ మూవీస్ లో ఇది బెస్ట్ అనిపించడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి…
సినిమా కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ సెకెండ్ ఆఫ్ కొంచం ఎక్కువ డ్రాగ్ అయిన ఫీలింగ్ లాంటివి కలిగినా కూడా బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. సినిమాలో అజిత్ హీరోయిజం, మ్యానరిజమ్స్, ఎలివేషన్స్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు…
కానీ అదే టైంలో స్టోరీ మీద డైరెక్టర్ మరింత ఫోకస్ చేసి ఉంటే ఔట్ పుట్ ఇంకో రేంజ్ లో ఉండేది అని చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశాయి…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్ అయినా పర్వాలేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కుమ్మేశాయి.
అజిత్ వన్ మ్యాన్ షో గా డైరెక్టర్ సినిమాను బాగానే డిసైన్ చేశాడు…చాలా టైం తర్వాత ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు అని చెప్పాలి, కానీ అదే టైంలో ముందే చెప్పినట్లు కథ, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ సీన్స్, కొన్ని ఇల్లాజికల్ సీన్స్ మీద ఫోకస్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఔట్ పుట్ వచ్చేది..ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…