Home న్యూస్ కోట బొమ్మాళి P.S మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

కోట బొమ్మాళి P.S మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా కోటబొమ్మాళి(Kota Bhommali P.S) మూవీ లింగి లింగి లింగిడి సాంగ్ వలన మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుందో లేదో తెలుసు కుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే పొలిటీషియన్స్ వలన కోట బొమ్మాళి ఏరియాలో ఉండే పోలిస్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…మలయాళంలో రిలీజ్ అయిన నాయట్టు సినిమాకి రీమేక్ గా..

ఈ సినిమా తెరకెక్కినా కూడా మెయిన్ స్టోరీలో చాలా మార్పులే చేశారు…చాలా వరకు తెలుగు లో చేసిన మార్పులు బాగానే వర్కౌట్ అయ్యి స్క్రీన్ ప్లే పరంగా సినిమా బాగానే మెప్పించింది అని చెప్పాలి. కొన్ని చోట్ల ట్విస్ట్ లు, పోలిసుల గురించి శ్రీకాంత్ చెప్పిన డైలాగ్స్ బాగా మెప్పించేలా ఉన్నాయి అని చెప్పాలి…

అలాగే శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ బాగుండగా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కూడా ఆకట్టుకున్నారు…మిగిలిన యాక్టర్స్ లో మురళీశర్మ మెప్పించగా సంగీతం బాగుండగా ఆల్ రెడీ సూపర్ హిట్ అయిన లింగిడి సాంగ్ స్క్రీన్ పై కూడా మెప్పించింది…ఇక ఎడిటింగ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించేలా ఉండగా….

స్క్రీన్ ప్లే పరంగా మాత్రం పోలిస్ చేసింగ్ సీన్స్ చాలా వరకు రిపీటివ్ గా అనిపించడం బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ మెప్పించగా అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఇక డైరెక్టర్ ఒరిజినల్ ని చాలా వరకు తెలుగు ఆడియన్స్ కి టేస్ట్ కి తగ్గట్లు మార్చి మెప్పించాడు…

సినిమా స్టోరీ పాయింట్, ఆల్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, పోలిసుల పై శ్రీకాంత్ డైలాగ్స్, లింగిడి సాంగ్ మేజర్ హైలెట్స్ అని చెప్పాలి. ఇక కథనం కొంచం స్లో గా ఉండటం, చేసింగ్ సీన్స్ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేయడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి. సింపుల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను…కొన్ని సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా వరకు ఆకట్టుకున్న ఈ సినిమా…

ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పాలి. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి కొన్ని సీన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసినా ఓవరాల్ గా సినిమా బాగానే మెప్పించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here