10 ఏళ్లకి టర్నింగ్ పాయింట్…8 రోజుల్లో నంబర్ 1

0
683

     అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది….2009 జోష్ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన నాగచైతన్య కి కెరీర్ లో అడపా దడపా హిట్లు పడినా కానీ టర్నింగ్ పాయింట్ అనిపించే విధంగా అయితే హిట్ పడలేదు. 2017 లో రారండోయ్ వేడుక చూద్దాం తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన నాగ చైతన్య కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు కానీ అది కూడా టర్నింగ్ పాయింట్ అనలేం.

తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాఫ్స్ ఎదురు అవ్వగా ఫస్ట్ లుక్, అండ్ టీసర్ రిలీజ్ కి ముందు వరకు ఏమాత్రం అంచనాలు లేని మజిలీ సినిమా పై ఆశలు తక్కువగానే ఉన్నా, టీసర్ రిలీజ్ నుండి ట్రైలర్ రిలీజ్ వరకు క్రమంగా సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పై మంచి పాజిటివిటీ ఏర్పడగా సినిమా రిలీజ్ అయ్యాక కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా అప్పటి నుండి మొదలైంది కలెక్షన్స్ జోరు. సినిమా మొదటి వారం ముగిసే లోపే బ్రేక్ ఈవెన్ అయ్యిపోయి సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో తన కెరీర్ బెస్ట్ హిట్ అయిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది, దాంతో పాటే నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచి వరుస ఫ్లాఫుల్లో కూడా..

కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారింది మజిలీ సినిమా, తర్వాత ఒకటి రెండు నికార్సయిన బ్లాక్ బస్టర్స్ మజిలీ లాంటివి పడితే నాగ చైతన్య రేంజ్ అమాంతం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మజిలీ ఫైనల్ రన్ లో 40 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కూడా గట్టిగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here