బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో ఏ సినిమా వచ్చినా కూడా రిలీజ్ అయిన రెండు మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా..కొన్ని సినిమాలు మాత్రం డిజిటల్ రిలీజ్ కోసం కొంత టైం పడుతూ ఉండగా…లాస్ట్ ఇయర్ జూన్ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన శర్వానంద్(Sharwanand) నటించిన మనమే(Manamey Movie) …
మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా టార్గెట్ ను అందుకుని డీసెంట్ హిట్ గా నిలిచింది కానీ సినిమా ఓటిటి రిలీజ్ మాత్రం ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయిన…
9 నెలల తర్వాత మనమే మూవీ ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోగా ఓటిటి లో ఇప్పుడు సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తి గా మారగా..
ప్రైమ్ వీడియోలో బాగానే ట్రెండ్ అవుతూ జోరు చూపెడుతున్న సినిమా కథ పాయింట్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా విజువల్స్ చాలా రిచ్ గా ఉండటం, శర్వానంద్ ఎనర్జీ ఎక్స్ లెంట్ గా మెప్పించడం. చిన్న బాబుతో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉండటం…
కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ అలాగే కామెడీ కూడా వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా డీసెంట్ టైం పాస్ మూవీ లా సినిమా అనిపించింది అని చెప్పొచ్చు…స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ఫైనల్ ఔట్ పుట్ ఇంకా సాలిడ్ గా ఉండేదని చెప్పొచ్చు…
మిక్సుడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచిన మనమే మూవీ ఇప్పుడు డిజిటల్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…టాప్ ట్రెండ్ మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతున్న మనమే…9 నెలల రిలీజ్ తర్వాత ఇప్పుడు డిజిటల్ లో కూడా మంచి జోరు ని చూపెడుతూ దూసుకు పోతుంది…