విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ అసురన్ సినిమా ను తెలుగు లో నారప్ప పేరు తో రీమేక్ చేయగా సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రావాల్సింది కానీ నిర్మాతలలో ఒకరైన కలైపులి థాను నిర్మించిన కర్ణన్ సినిమా నష్టపోయిందన్న కారణం తో ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేశారు… రీమేక్ అయినా కానీ ఓవరాల్ గా…
సెన్సేషనల్ డిజిటల్ రిలీజ్ రేటు ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత శాటిలైట్ రైట్స్ ఇలా అన్నింటా అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ప్రైమ్ వీడియో వాళ్ళకి సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను కూడా తెచ్చి పెట్టిన ఈ సినిమా…
ఇక సినిమా బాలెన్స్ ఉన్న హిందీ డబ్బింగ్ రైట్స్ ను కూడా రీసెంట్ గా అమ్మేశారని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సినిమా కి సెన్సేషనల్ అనిపించే విధంగా 9 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందని అంటున్నారు ఇప్పుడు.
ఇది ఓ రేంజ్ రేటు అని చెప్పాలి…. రీమేక్ సినిమా అందునా సీనియర్ హీరో సినిమా అయినా కానీ ఈ రేంజ్ రేటు ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం మీద సినిమా నిర్మాతలకు నష్టం వచ్చింది అని ఈ సినిమాను అమ్మినా మొత్తం మీద అన్ని ప్లాట్ ఫామ్స్ లో సినిమా కి ఊహకందని లాభాలను సొంతం చేసుకుని….
ఈ సినిమా సంచలనం సృష్టించింది. థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమా ఇదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా జోరు చూపి ఉండేది, కానీ అలా కాకుండా డిజిటల్ లో రిలీజ్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా దుమ్ము లేపే రికార్డులతో దూసుకు పోతున్న ఈ సినిమా నిర్మాతలకు మొత్తం మీద డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.